1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nagarjuna

Rummy | Nagarjuna | Actor | Surendra | నాగార్జున మరీ ఇంత దిగజారుతారనుకోలేదు...

రమ్మీ
"రమ్మి" చిత్రం టైటిల్ గురించి తమను సంప్రదిస్తే 12 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు నాగార్జున చెప్పడం తమను బాధించిందని, అసలు అది నిజం కాదని నిర్మాత సురేంద్ర అన్నారు.

వివరాలలోకి వెళితే.. కామాక్షి మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి "రమ్మి" అనే పేరు పెట్టడానికి ఇంతకుముందే టైటిల్ రిజిస్టర్ చేసిన వ్యక్తిని సంప్రదిస్తే 12 లక్షలు డిమాండ్ చేశారని దీనిపై ఛాంబర్‌కు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి నాగార్జున తెలియజేశారు.

దీనికి కౌంటర్‌గా మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని తన సాఫ్ట్‌వేర్ కార్యాలయంలో సురేంద్ర అనే నిర్మాత వివరణ ఇచ్చారు. తమకు సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయనీ, రమ్మీ పేరుతో సినిమా తీయాలని ఆ పేరును రిజిస్టర్ చేసి, హీరో శివాజీ, బ్రహ్మానందం, వేణు మాధవ్ తదితరులకు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చామనీ అనుకోకుండా చిత్ర దర్శకుడు శరత్ చ్చంద్ర హఠాన్మరణం చెందడంతో వాయిదా పడిందన్నారు.

కామాక్షిమూవీస్ నుంచి ఓ వ్యక్తి వచ్చి లక్ష రూపాయిలిస్తాం... టైటిల్ ఇవ్వమని అన్నారు. మేం కుదరదని చెప్పాం. అంతేకానీ 12 లక్షలు డిమాండ్ చేయలేదు. నాగార్జున పెద్ద హీరో. ఆయనంటే తమకు గౌరవమనీ, కానీ ఇలా దిగజారుడు ప్రకటన చేయడం సమంజసం కాదని అన్నారు. దీనిపై నిర్మాతలమండలికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT