Posani Krishna Murali| Miss Chintamani M.A| Namitha| Shooting| Cinema | "మిస్ చింతామణి యం.ఎ"గా వస్తోన్న పోసాని!
పోసాని, నమిత జంటగా "మిస్ చింతామణి యం.ఎ"
WD
యం.కె. మూవీస్ పతాకంపై అందరూ మెచ్చే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. రాజా వన్నెంరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం (డిసెంబర్ 2) సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుడి పటాలపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.
ఈ సందర్భంగా యం.కె. మూవీస్ అధినేతల్లో ఒకరైన ఎ. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ఈ తరం ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి కథను రచయిత రాజేంద్రకుమార్ చెప్పారు. ఇది అన్ని తరగతుల వారికి నచ్చుతుంది.
ఇందులో పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రధారి కాగా, అందాల నటి నమిత మరో ముఖ్యమైన భూమికను పోషిస్తోంది. ఇప్పటికే మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, జెంటిల్మెన్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన పోసానికి ఈ చిత్రం మంచి గుర్తింపును సంపాదించిపెడుతుంది. ఇక మిగిలిన తారాగాణం ఎంపిక చేసి జనవరి మూడోవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ను ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేస్తామని చెప్పారు.
ఈ చిత్రానికి కథ, మాటలు పి. రాజేంద్రకుమార్ సమకూర్చుతుండగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఎ. విజయ్‌కుమార్, ఎడిటింగ్: ఎస్.వి.ఎస్. రవి, కో-డైరక్టర్: దిలీప్, సహనిర్మాతలు: డా.వి. మహేష్‌కుమార్, జి. మహేష్ చౌదరి, నిర్మాతలు: కె. చంద్రశేఖర్ (జీతూ), ఎ. ఉదయశంకర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి.