1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Subhadra| Cinema| Sindhu Menon| Ravikiran| Asish Vidyardhi | సింధుమీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న "సుభద్ర"

సుభద్ర
WD
శ్రీకాంత్ టాకీస్ పతాకంపై చందమామ ఫేమ్ సింధు మీనన్ ప్రధాన పాత్రధారిణిగా "సుభద్ర" అనే చిత్రం రూపొందుతోంది. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ఇ. శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర బేనర్, టైటిల్ లోగో, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలు ఫిలింక్లబ్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ బేనర్‌ను ఆవిష్కరించగా, డా.డి. రామానాయుడు లోగో ఆవిష్కరించారు. పాటలను నిర్మాత స్నేహితుడు ప్రభాకర్ యాదవ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన నిర్మాత పెద్ద నిర్మాతగా ఎదగాలని దీవించారు. కళ్యాణ్ మాట్లాడుతూ.. కథంతా సింధుమీనన్ చుట్టూ తిరుగుతుంది. తాను రామానాయుడుని ఆదర్శంగా తీసుకుని ఈ రంగంలోకి వచ్చాను. అలాగే శ్రీకాంత్ కూడా ఆ స్థాయికి ఎదుగుతాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.

దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ.. కామెడీ చిత్రాలు తీసే తాను డిఫరెంట్‌గా ఉండాలని కథ చెప్పాను. వెంటనే నిర్మాత అంగీకరించారు. కథాపరంగా చెప్పాలంటే... పుట్టింటివారిని గౌరవిస్తూ అత్తింటివారిని బాగా చూసుకునే పాత్ర మహాభారతంలో సుభద్రది. ఆ పాత్ర ప్రేరణతో ఈ కథను తయారు చేశాను.

అర్జునుడి లాంటి పాత్రను కొత్త కుర్రాడు రవికిరణ్ పోషించాడు. ఇందులో ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్ర పోషించగా, టైటిల్ పాత్రను సింధుమీనన్ పోషిస్తోందని చెప్పారు.

భానుచందర్ మాట్లాడుతూ.. ఇందులో తాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించానని, నైట్ ఎఫెక్ట్‌లో సినిమాను అద్భుతంగా తీశారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశిష్ విద్యార్థి, సింధుమీనన్‌లు కూడా మాట్లాడారు.
About Writer
SELVI.M