1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Gopichand

Golimar| Gopichand| Puri Jagannath| Sivamani| Pokiri| Bumper Offer | బెల్లంకొండకొచ్చిన "గోలీమార్"

గోపిచంద్
WD
గోపీచంద్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న గోలీమార్ చిత్రం నిర్మించే అవకాశం బెల్లంకొండ సురేష్‌కు వచ్చింది. గత వారంరోజులుగా చర్చలు నడుస్తుండగా శుక్రవారంతో ఈ విషయం ఖరారైంది.

ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 20 ఏళ్లనాడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు ఏం పనిలేదు. రోజూ పూరీ నేను కలిసి తిరిగేవాళ్లం. అలా ఏర్పడిన పరిచయం ఆయన దర్శకుడు అయ్యాక కూడా సినిమా చేయాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు ఎన్‌కౌంటర్ దయానాయక్ స్ఫూర్తితో తీస్తున్న కథ నచ్చడంతో సినిమా చేస్తున్నానన్నాను. వెంటనే ఆయన దానికి అంగీకరించారు. ఈ నెల 28 నుంచి షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్‌లో విడుదల చేయడానకి సిద్ధం చేస్తున్నామన్నారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, దయానాయక్ స్ఫూర్తిగా రాసుకున్న కథ ఇది. ఆయనను చాలాసార్లు కలిశాను. ఆ సమయంలో పలు విషయాలను తెలియజేశారు. ఆయనపై వ్యక్తిగతంగా కొన్ని కాంట్రవర్శీలు ఉన్నా అవి ప్రూవ్ కాలేదు. ఏదేమైనా మన నేటివిటీకి సరిపడా కథాంశంగా మార్చుకుని తెరక్కెక్కిస్తున్నాం అన్నారు.

గోపీచంద్ మాట్లాడుతూ... జగన్ చిత్రాల్లో ఒక్కసారైనా నటించాలనుకునేవాడిని. ఇంతకుముందు అంతా నామీద బరువు బాధ్యతలుండేవి. ఇప్పుడవన్నీ పూరీగారు భరిస్తారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయినా లవ్ ట్రాక్‌తో సాగే కథాంశమిది అన్నారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ.. ఇందులో ఆరు పాటలున్నాయనీ, అందరూ మెచ్చే పాటలవుతాయని అన్నారు.