Jagapathi Babu| Ram Gopal varma| Gayam-2| Praveen Sri| Sequel| Cinema | జగపతిబాబు హీరోగా వర్మ శిష్యుడి "గాయం-2"
WD
జగపతిబాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ ప్రియశిష్యుడు ప్రవీణ్ శ్రీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూజ జరిగింది. సీనియర్ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ స్క్రిప్టును దర్శకుడు ప్రవీణ్ శ్రీకు అందజేశారు.
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. యాక్షన్ హీరోగా తనకు మంచి ఇమేజ్ తీసుకువచ్చిన "గాయం" చిత్రానికి సీక్వెల్ తయారవడం ఆనందకరమైన విషయం. ఏదో సీక్వెల్ అని చెప్పి వేరే తరహాలోకాకుండా అద్భుతంగా రూపొందింస్తున్నామని చెప్పారు. భారతదేశంలో తనకు తెలిసి ఇలా పర్‌ఫెక్ట్ సీక్వెల్ చేయడం ఇదే ప్రథమమని జగపతిబాబు అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ శ్రీ మాట్లాడుతూ.. "గురువు చేసిన సినిమాకు సీక్వెల్ చేసే అవకాశం రావడం ఎంతో హ్యాపీగా ఉందన్నారు. ప్రస్తుతం ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ నెలాఖరులో చిత్రీకరణ మొదలవుతుంది. హైదరాబాద్, వైజాగ్‌తో పాటు విదేశాల్లో కూడా చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్ మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.