Actor Srihari, 100 Deveudostadu, P Srinivas | శ్రీహరితో "100 దేవుడొస్తాడు"
పోలీస్, దేవా, సాంబయ్య వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన శ్రీహరి మళ్లీ పోలీసుగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "100 దేవుడొస్తాడు" అనే పేరు పెట్టారు. సుధా ఎంటర్‌టైనర్స్ పతాకంపై జిఎల్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోలూరి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
శుక్రవారం రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. రియల్‌స్టార్ శ్రీహరిపై డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, కె. రాఘవేంద్రరావు కెమేరా స్విచ్చాన్ చేశారు. రాజమౌళి, శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.
శ్రీహరి మాట్లాడుతూ, "ఈ రోజుల్లో ట్రబుల్లో ఉంటే 100కు ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు. పోలీసులను దేవుడిగా భావిస్తారు. గతంలో పోలీసు పాత్రలు చేసినవన్నీ హిట్టయ్యాయి. ఈ చిత్రం చూశాక నేరాలు చేసేవారికి హెచ్చరికగా ఉంటుంది. రోమియో చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార"ని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ... జనవరి మొదటివారంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తామన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... శ్రీహరి దగ్గర పెరిగినవాడిని. మంచి కథాంశం. అవకాశమిచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు: స్వామీజీ- విజయ్, సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయకుమార్, సంగీతం: ఆర్.మురళీధర్, ఎగ్లిక్యూటివ్ నిర్మాత: ఎ.రమానంద్