Mahamuduru | Vijay | Namita | Sreya | డిసెంబరు నెలాఖరులో "మహాముదురు"
లక్ష్మీ వేంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నేపధ్య గాయకుడు మనో సమర్పణలో అడ్డాల వెంకట్రావు, జమీలా నిర్మాతలుగా తమిళంలో విజయవంతమైన చిత్రాన్ని మహాముదురుగా తెలుగులోకి అందిస్తున్నారు. డబ్బింగ్, డీటీఎస్ కార్యక్రమాలు ముగించుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది.
ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో రూపొందిన అద్భుతమైన ట్యూన్స్ అందించారు. ఈ చిత్రంలో విజయ్, శ్రియ, నమిత, భరణి, షిండే, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం భరతన్ వహించారు.
