Bina Rai| Taj Mahal| Anarkali| Prem Nath Malhotra| Aurat| Bollywood| Cinema | తాజ్‌మహల్ కథానాయిక "బీనారాయ్" కన్నుమూత
అనార్కలి, తాజ్‌మహల్ వంటి చిత్రాల ద్వారా భారతీయ చలన చిత్ర సీమలో సుస్థిరమైన స్థానాన్ని పదిలం చేసుకున్న అలనాటి బాలీవుడ్ మేటి నటి బీనారాయ్ గుండెపోటుతో కన్నుమూశారు. 78 ఏళ్ల బీనారాయ్ ఆదివారం ఉదయం ఐదు గంటలకు తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
1936, జూన్ నాలుగోతేదీన లక్నోలో జన్మించిన బీనారాయ్.. 1951లో "కాళి గాథ" చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఔరత్, సమందర్, షాగుఫా, వతన్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు సంపాదించిపెట్టాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు (1951-1990) వందకు పైగా చిత్రాల్లో నటించిన బీనారాయ్.. ప్రముఖ నటుడు ప్రేమ్‌నాథ్‌ను వివాహం చేసుకున్నారు. బీనారాయ్ దంపతులకు ఇద్దరు కుమారులు.
ఇకపోతే.. ఆదివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బీనారాయ్ భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె కుమారుడు ప్రేమ్ కిషన్ మీడియాతో అన్నారు.