Thriller Manju, Akash, Ayesha | శరవేగంగా ఆకాష్, థ్రిల్లర్ మంజు చిత్రం
ఆకాష్, గౌరీ పండిట్, అయేషా, థ్రిల్లర్ మంజు ప్రధాన పాత్రధారులుగా సిగ్నస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి థ్రిల్లర్ మంజు ఫైట్స్‌ను సమకూర్చడంతోపాటు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రానికి ముందు అనుకున్నట్లు జయహే టైటిల్ కాకుండా కథానుగుణంగా మరో టైటిల్‌ను త్వరలో ఖరారు చేయనున్నామని నటుడు, దర్శకుడు థ్రిల్లర్ మంజు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకూ తొలి షెడ్యూల్‌ను జరుపనున్నామని ఆయన చెప్పారు. అందులో భాగంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తామని అన్నారు.
జనవరి మొదటివారంలో హైదరాబాదులో జరిపే మూడవ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని ఆయన వివరించారు. చక్కటి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, ఇందులో ఐదు పాటలుంటాయని అన్నారు.
కాగా ప్రతి సన్నివేశాన్ని థ్రిల్లర్ మంజు వైవిధ్యభరితంగా చిత్రీకరిస్తున్నారనీ, సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని ఈ చిత్రం తనకు యాక్షన్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందన్న అభిప్రాయాన్ని ఆకాష్ వ్యక్తం చేశారు.
ఇంకా ఈ చిత్రంలో అయేషా, గౌరీ పండిట్, సూర్యనారాయణ్, శ్రద్ధాశర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: వంశీ, పాటలు: భాస్కరభట్ల, నిర్మాణం: సిగ్నస్ ఎంటర్‌టైన్‌మెంట్, కథ, స్క్రీన్ ప్లే, స్టంట్స్, దర్శకత్వం: థ్రిల్లర్ మంజు