Christmas, Gudugudugunjam, Rajendraprasad | క్రిస్మస్‌కి "గుడుగుడుగుంజం" ఆడియో
టూమచ్, ఎక్స్ ట్రా చిత్రాల సక్సెస్ తర్వాత శ్రీచిత్ర బ్యానర్‌పై హ్యాట్రిక్ చిత్రంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్, పార్థు, బ్రహ్మానందం ప్రధానతారాగణంగా "గుడుగుడుగుంజం" షూటింగ్ బ్యాంకాక్‌లో ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 20 వరకూ రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో ప్యాచ్‌వర్క్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత రవికుమార్ రెడ్డి తెలిపారు.
దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో 60 రోజులపాటు షూటింగ్ జరిపిన ఈ చిత్రంకోసం రెండుసార్లు బ్యాంకాక్ వెళ్లి 50 శాతం సీన్లు, 7 పాటలు రెండు కెమేరాలతో నిర్విరామంగా జరిపామన్నారు. ఈ చిత్రాన్ని నలుగురు హీరోయిన్లు, పార్థు(నవదీప్ సోదరుడు), బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌తో చాలా రిచ్ గా 24 రోజుల్లో పూర్తి చేశామని మరో నిర్మాత శ్రీధర్ వర్మ తెలిపారు.
ఈ చిత్రంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, పార్థు, బ్రహ్మానందం, సుమన్, సితార, కస్తూరి, చాహత్, ఫరాఖాన్, రితిమ, ఆర్తి, కృష్ణభగవాన్, ఎమ్ఎస్, కొండవలస, తెలంగాణా శకుంతల తదితరులు నటించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: మరుధూరి రాజా, కథ, సంగీతం, దర్శకత్వం: వీరు