1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nitin

Seetaramula Kalyanam Lankalo | Nitin | Hansika | వైజాగ్, అరకులో "సీతారాముల కల్యాణం" (లంకలో)

సీతారాముల కల్యాణం లంకలో
WD
సిద్దూ ఫ్రం శీకాకుళం వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత విజయ్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సీతారాముల కల్యాణం (లంకలో). యంగ్ స్టార్ నితిన్, క్యూట్ గాళ్ హన్సిక జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడు.

కండ బలంకన్నా బుద్ధి బలం గొప్పదన్న పాయింట్‌ను ఆధారం చేసుకుని సాగే ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలను తెరకెక్కిస్తున్నారు. డిసెంబరు 4 నుంచి 7 వరకూ నాలుగు రోజులపాటు వైజాగ్‌లో హీరో నితిన్‌తో పాటు డ్యాన్సర్లు పాల్గొనగా భాస్కరభట్ల రాసిన బేసిగ్గా... ఓపిగ్గా.. ఉండటం మాకు రాదే... తేలిగ్గా... తీరిగ్గా.. తిరిగే మనసు మాదే అంటూ పాటకు గణేష్ మాస్టర్ నృత్యరీతులను సమకూరుస్తున్నారు.

అదేవిధంగా మరోపాటను డిసెంబరు 8 నుంచి 10 వరకూ షూటింగ్ చేస్తే చిత్రం పూర్తవుతుందని చిత్ర దర్శకుడు వెల్లడించారు. ఆడియోను డిసెంబరు 18న, సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT