Nagarjuna | Greek | Kamakhi Movies | నాగార్జునని సత్కరించిన గ్రీకు ప్రభుత్వం
WD
ఈ సందర్భంగా మిలోస్ ఐలాండ్‌లో జరిగిన సత్కార సభలో గ్రీక్ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ.. నాగార్జునగారి రాక గ్రీక్ టూరిజం డిపార్ట్‌మెంట్‌కి గ్రేట్ డేగా భావిస్తున్నాం. నాగార్జునగారిని సత్కరించుకోవడం మా అదృష్టం. ఈ అవకాశాన్ని మాకిచ్చిన కామాక్షి కళా మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్‌కి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్లీ మళ్లీ గ్రీకువీరుడు నాగార్జున మా గ్రీస్‌కు రావాలని కోరుకుంటున్నాం అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ... గ్రీస్‌లో షూటింగ్ చెయ్యడం హ్యాపీగా ఉంది. అన్నివిధాలా సహకారాన్ని అందిస్తున్న గ్రీస్ ప్రభుత్వానికి, గ్రీక్ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు థ్యాంక్స్ అన్నారు. కాగా కింగ్ నాగార్జున, మమతా మోహన్ దాస్‌లపై కేడి కోసం గ్రీస్‌లో పాట చిత్రీకరిస్తున్నారు. డిసెంబరు 11 వరకూ గ్రీస్‌లో ఈ షూటింగ్ కొనసాగుతుందని నిర్మాత తెలిపారు.