1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sexy actress

Amisha Patel | Sexy actress | Gastro infection | అమీషా... నాన్ వెజ్ జోలికి వెళ్లబోకు: వైద్యులు

అమీషా పటేల్
పవన్ కల్యాణ్ "బద్రి" చికిత అమీషా పటేల్ అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైంది. తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యతో ముంబయిలోని సబర్బన్ ఆస్పత్రికి వెళ్లిన ఆమెను వైద్యులు పరీక్షించి వ్యాధి అంత ప్రమాదకర స్థాయిలో లేదని చెప్పారు. అయితే తీసుకునే ఆహారం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

ద్రవ పదార్థాలు, కూరగాయలు మాత్రమే తీసుకోవాలనీ, మాంసాహారాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టాలన్నారు. వైద్యుల సలహాలను తు.చ తప్పకుండా పాటిస్తానని అమీషా పటేల్ చెపుతోంది. ముందుగా సమస్య గురించి తెలుసుకుని వెళ్లడం వల్ల తొలిదశలోనే వ్యాధిని గుర్తించడటంతో చికిత్స సులభమైందని చెప్పింది.

తనకు పరీక్ష చేసిన వైద్యులే అమితాబ్, సైఫ్ అలీ ఖాన్‌లకు కూడా చేశారని పాత సంగతులు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి తనను వైద్యులు ఆస్పత్రిలో చేరమంటున్నారని వెల్లడించింది అమీషా.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT