1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Gunasekhar

Varudu | Gunasekhar | Allu Arjun | Summer special | మార్చి 26న అల్లు అర్జున్, గుణశేఖర్‌ల "వరుడు"

వరుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర విశేషాలను దర్శకులు గుణశేఖర్ వివరిస్తూ... అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లకు భిన్నంగా ఓ వైవిధ్యమైన పాత్రని వరుడులో చేస్తున్నారు. 

బన్నీ పెర్‌ఫార్మెన్స్ హైలెట్ అవుతుంది. అలాగే విలన్‌గా తమిళ హీరో నటించడం విశేషం. అల్లు అర్జున్, ఆర్య పాల్గొన్న క్లైమాక్స్ ఫైట్‌ని 15 రోజులపాటు స్టంట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో చిత్రీకరించాం. హీరో, విలన్‌ల మధ్య హోరా హోరీ జరిగే ఈ ఫైట్ ఈ చిత్రంలో హైలెట్ అవుతుంది.

అలాగే ఈ చిత్రంకోసం 100కు పైగా రియల్ ఫ్యామిలీస్ వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమాలో నటించడం మరో విశేషం. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కొన్ని వందలమందిలో మా క్యారెక్టర్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది.

సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్న వరుడు చిత్రానికి మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్‌ను అందిస్తున్నారు. చక్కని కథతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మార్చి 26న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నాం. రెండు పాటలు, ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరిలో ఆడియోను రిలీజ్ చేస్తాం. సమ్మర్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి మార్చి 26న వరుడు మీ ముందుకు వస్తున్నాడు అని చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT