1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Allari Naresh

Vamsi | Allari Naresh | Gopi Gopika Godavari | Bendu Apparao | Cinema | వంశీ-అల్లరి నరేష్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం!

వంశీ
WD
వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. "వంశీ దర్శకత్వంలో సినిమా చేయాలనేది నా చిరకాల వాంఛ. వెండితెరపై వినోదాన్ని పండించడంలో వంశీది ఒక ప్రత్యేకమైన శైలి. మా కలయికలో రూపొందనున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు నవ్వుల విందు భోజనం వడ్డిస్తుంది" అని చెప్పారు.

కుమార్‌చౌదరి మాట్లాడుతూ.. "గోపి గోపిక గోదావరి" వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వంశీ చేస్తున్న సినిమా ఇది. అలాగే "బెండు అప్పారావు" విజయంతో అల్లరి నరేష్ కూడా మంచి స్పీడ్‌లో ఉన్నారు. వీరిద్దరి కలయికతో సినిమా అంచే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడుతాయి. ఆ అంచనాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది.

పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందనుంది. వంశీ-చక్రి కాంబినేషన్ అంటే.. పాటలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. ఫిబ్రవరిలో ఈ చిత్రం ఓపెనింగ్ జరుగుతుంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం" అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రవి సదాశివుని.
About Writer
SELVI.M