Kingfisher Hot calendar 2010 | Hot Babes | Models | Sea Beach | కింగ్ ఫిషర్ హాట్ క్యాలెండర్ 2010పై బికినీ బాంబులు
నూతన సంవత్సరం వస్తుందంటే చాలు క్యాలెండర్ల సందడి మొదలవుతుంది. ఈ క్యాలెండర్లలో రకరకాలున్నాయి. జ్యోతిష్య సంగతులను చెపుతూ వచ్చే క్యాలెండర్లను ప్రక్కనపెడితే వినియోగదారులకు మత్తెక్కించే హాట్ క్యాలెండర్లు సైతం తయారవుతుంటాయి. ఇటువంటి హాట్ క్యాలెండర్లను తయారు చేయడంలో అందరికంటే అగ్రస్థానంలో ఉన్నది కింగ్‌ఫిషర్.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 6 బీరు బాటిళ్ల అమ్మకాలను చేసే కింగ్‌ఫిషర్ ఈ హాట్ క్యాలెండర్ తయారుచేసేందుకు కోట్ల రూపాయలను కుమ్మరిస్తుంది. క్యాలెండర్ తయారు చేసే క్రమంలో వేడి పుట్టించే హాటెస్ట్ మోడళ్లు, తమ క్రియేటివిటీని జోడించి మోడళ్ల అందాలను కొత్త కోణాల్లో చూపగల ఫోటోగ్రాఫర్లకు కోట్లలో పారితోషికాలు కింగ్ ఫిషర్ ముట్టజెపుతుంది.
ఇక క్యాలెండర్‌పై హాట్ భామ ఫోటో ఎక్కేందుకు బ్యాక్‌గ్రౌండ్ దృశ్యం కూడా అంతే హీట్‌ను రగిలించాలి కదా. అందుకోసం కింగ్‌ఫిషర్ మంచి మంచి లొకేషన్లను సెలక్ట్ చేస్తుంది. ఈ లొకేషన్లలో అమ్మడి ఫోటోను క్లిక్‌మనిపించి క్యాలెండర్‌పైకి ఎక్కిస్తే అది చూసిన బీరు బాబు బోర్లా పడిపోవాల్సిందే.
కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై కత్రినాకైఫ్, యానాగుప్తా, దీపికా పదుకునే వంటివారు కూడా కనిపించి కనువిందు చేశారు. క్యాలెండరుపై కనిపించిన తర్వాతే వారికి సినిమాలో మంచి మంచి అవకాశాలు వచ్చినట్లు చెపుతారు. అంతా హాట్ క్యాలెండర్ మహిమ.
