1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Film

Women Pandavas | Film | Tollywood | ఆడపాండవులు వస్తున్నారోచ్

ఆడ పాండవులు
పాండవులు అంటే ఇంతవరకూ మగవారనే భారతం చెబుతుంది. కానీ సినిమా రంగం మాత్రం ఆడపాండవులు ఉన్నారని కొత్త భాష్యం చెప్పబోతోంది. అది ఎలాగా...? ఏమిటి? అనేది చిత్రం వచ్చేదాకా ఆగాల్సిందేనంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.

శ్రీలక్ష్మీ మూవీమేకర్స్ పతాకంపై ఐదుగురు ఆడవాళ్లు ప్రధానపాత్ర పోషిస్తున్న ఆడపాండవులు చిత్రం షూటింగ్ శుక్రవారం సారథి స్టూడియోలో ప్రారంభమైంది. తొలి షాట్‌కు డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ క్లాప్ కొట్టగా నిర్మాత శ్రేయోభిలాషి గోగిరెడ్డి శ్రీనివాస్ కెమేరా స్విచాన్ చేశారు.

చిత్రం గురించి చిత్ర దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ... సమాజంలో స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాలకు, అకృత్యాలకు ఐదుగురు అమ్మాయిలు పడ్డ ఆవేదనే ఈ చిత్ర ఇతివృత్తం. వారి ఆవేదనలోనుంచి ఆలోచనపుట్టి తమ జాతికి గౌరవం తెచ్చేలా వారెలా ప్రవర్తించారన్నది ఈ చిత్రంలో చెబుతున్నామని తెలిపారు.

నిర్మాత నల్లాని వెంకటరమణ వ్యాఖ్యానిస్తూ... శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ను జరిపి సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తామన్నారు. తను ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటిస్తున్నానని తెలిపారు. కవిత మాట్లాడుతూ... వాణిజ్యాంశాలున్న చిత్రమైనా చక్కటి సందేశాత్మక చిత్రమని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT