1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nisha Agarwal

Vellee | Nisha Agarwal | Kajal Agarwal | కాజల్ సోదరి నిషాతో "వీళ్లే"

వీళ్లే
ఛార్మితో సస్పెన్స్ థ్రిల్లర్ మంత్ర చిత్రం తీసిన నిర్మాత రవిప్రకాష్ తన టీమ్‌తో కొత్తగా వీళ్లే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకుడిగా మారాడు. అలాగే హీరోహీరోయిన్లు మారారు. హీరోగా వాన ఫేమ్ వినయ్ కాగా, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ నటిస్తోంది. తొలిసారిగా ఆమె నటిస్తున్న చిత్రమిదే.

జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై వీళ్లే చిత్రం షూటింగ్ శుక్రవారం అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. వారిద్దరిపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా, కీరవాణి స్విచాన్ చేశారు.

చిత్ర సంభాషణ రచయిత చిత్రం గురించి వివరిస్తూ... మంత్ర చిత్రాన్ని తీసిన టీమ్ ఈ చిత్రాన్ని తీస్తుంది. ఆ సినిమాలో నిర్మాతయిన రవిప్రకాష్ వీళ్లేకు దర్శకుడయ్యాడు. నేటి యువత ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియజేస్తూ వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రాన్ని చూసినవారంతా ఒక్కసారి తమ గతాల్లోకి వెళ్లేలా చేస్తుందని అన్నారు.

దర్శకుడు రవిప్రకాష్ మాట్లాడుతూ, మంత్రతో భయపెట్టి ఆనందాన్ని పొందిన తాము ఇప్పుడు ప్రేమిస్తూ ప్రేక్షకులకు ప్రేమను పంచేందుకు ముందుకు వచ్చామన్నారు. చక్కటి మెలోడి అవకాశమున్న చిత్రమిదనీ, మొత్తం 10 పాటలున్నాయని సంగీత దర్శకుడు ఆనంద్ తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT