1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Hyderabad

Film Producers meet | Hyderabad | Film Industry | Tollywood | సినిమాలు తీసేది తెలంగాణావారా..?

సినీ నిర్మాతలు
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంఘటనలపై చలనచిత్ర పరిశ్రమ కలత చెందుతోంది. కళారంగానికి భాష, ప్రాంతీయ భేదం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. అసలు సినిమాలు తీసేది తెలంగాణాయేతరులేననీ, తెలంగాణావారికి పనికల్పిస్తున్నామన్న సంగతిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.

కొంతమంది స్వార్థపూరిత రాజకీయనాయకులు తమ ప్రయోజనాలకోసం రాష్ట్ర కావాలనుకోవడం తప్పు లేదన్నారు. అయితే ఆ నీడను చలనచిత్రరంగంపై పడనీయకండని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రం గురించి ఏం తెలుసని సోనియా, ప్రణబ్, చిదంబరంలు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. అవసరమైతే వారి రాష్ట్రాలను విభజించుకోవచ్చని హితవు పలికారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... అర్థరాత్రి అర్థంతరంగా ఢిల్లీలో ఉన్న ఎంపీలను సైతం సంప్రదించకుండా తెలంగాణాపై ప్రకటన చేయడం దుర్నీతికి నిదర్శనంగా పేర్కొన్నారు. అసలు 1964లో తెలుగు మాట్లాడేవారంతా సమైక్యాంధ్ర కావాలని కోరుకున్న విషయాన్ని చెబుతూ... అప్పటి పరిస్థితులను వివరించారు.

హైదరాబాదులో 80 లక్షల జనాభా ఉంటే అందులో 40 లక్షలు తెలంగాణాయేతరులేనని గుర్తు చేశారు. కొన్ని కోట్లు ఖర్చుచేసి హైదరాబాదును అభివృద్ధి చేసింది తెలంగాణావారా..? అని సూటిగా ప్రశ్నించారు. వీటన్నిటికీ పరిష్కారం సెకండ్ ఎస్సార్సీని అమలు చేయడం మినహా మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.

సెటిలర్స్‌కు రక్షణ ఏదీ...?
హైదరాబాద్‌లో సెటిలర్స్‌కు రక్షణ కల్పిస్తామని వివిధ రాజకీయనాయకులు, మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రకటించారు. ఎలా కల్పిస్తారు...? అరకులోనూ, బందర్‌లోనూ షూటింగ్ ఆగిపోయి వారిని భయపెడుతుంటే వారంతా వెళ్లి కాపాడుతారా...? అని చిన్న నిర్మాతలమండలి కార్యదర్శి నట్టికుమార్ ప్రశ్నించారు.

ప్రజలు కోరుకోవడం లేదు: చదలవా
అసలు ప్రజలే తెలంగాణాను కోరుకోవడం లేదని ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో రుజువైందని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. కార్పొరేషన్‌లో తమకు మద్దతు లేదని పోటీ చేయకుండా ఉన్న నాయకుడు తెలంగాణా కావాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. కేవలం స్వార్థపూరిత రాజకీయమేనని ఎద్దేవా చేశారు.

భవిష్యత్‌లో నష్టం: సాగర
ఉమ్మడికుటుంబం విడిపోతే నష్టం ఎలా ఉంటుందో భవిష్యత్ లో తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణా వస్తే అదే జరుగుతుందని ప్రముఖ దర్శకుడు సాగర్ చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT