1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Health

Actress Katrina Kaif | Health | Hemoglobin count | "మల్లీశ్వరి" కత్రినా ఆరోగ్యంపై ఆందోళన

కత్రినా కైఫ్
ఆమధ్య పసికర్ల వ్యాధితో కత్రినా బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వ్యాధి తగ్గిపోయిందని వైద్యులు చెప్పారు. కానీ ఆదివారం కత్రినాకైఫ్ ఉన్నట్లుండి కళ్లు తిరిగి కిందపడిపోయిందట. దాంతో మరోసారి ఆమెను ముంబయిలోని సబర్బన్ ఆసుపత్రికి తీసుక వెళ్లారు.

అక్కడ ఆమెకు ఆదివారం అంతా చేయాల్సిన పరీక్షలన్నిటినీ చేశారు వైద్యులు. ఆ పరీక్షల్లో కత్రినా హిమోగ్లోబిన్ కౌంట్ గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే హిమోగ్లోబిన్ ఇలా తగ్గిపోవడానికి కారణమేమిటన్నది మాత్రం వారు వెల్లడించలేదు.

రక్తంలో అసాధారణ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలను కనుగొనేందుకు తమకు సమయం కావాలని వారు చెపుతున్నారు. అప్పటివరకూ కత్రినా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కత్రినా కైఫ్‌కు అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఆమె ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. కత్రినా మాత్రం తనకు కాస్త నీరసంగా ఉందనీ, అంతకుమించి మరేమీ లేదని చెపుతోందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT