1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Telangana issue

Actor Balakrishna | Telangana issue | United Andhra | ఆంధ్రలో పరిస్థితి: హు... హు.. మన దౌర్భాగ్యం: బాలయ్య

బాలకృష్ణ
WD
గత పక్షం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్య నినాదాలతో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై యువరత్న బాలకృష్ణ వెరైటీగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడమని అడిగితే.. "హు.. హు.. మన దౌర్భాగ్యం" అన్నారు.

ఈ సందర్భంగా విలేకరులు బాలకృష్ణను మళ్లీ ఒత్తిడి చేసి తెలంగాణా, సమైక్యాంధ్రపై స్పందన తెలియజేయాలని కోరినప్పుడు ఆయన "చెప్పానుగా... హు... హు..." అని మళ్లీ అన్నారు.

బాలకృష్ణ వద్ద నుంచి ఏదో ఒక మాటను లాగాలని చూసిన విలేకరుల ఆశ మాత్రం నెరవేరలేదు. దీంతో విలేకరులు కూడా హు.. హు.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT