1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Swetha Basu

Uday Kiran | Swetha Basu | Love Story | Pondicherry | Ashish vidyarthi | పాండిచ్చేరిలో ఉదయ్, శ్వేతబసుల చిత్రం

ఉదయ్ కిరణ్
WD
ఉదయ్‌కిరణ్ హీరోగా శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్‌గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ఓ షెడ్యూల్‌ని పాండిచ్చేరిలో పూర్తి చేసుకుంది. ఈశ్వర వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుభాసెల్వం దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు యు.కె. ఎవెన్యూస్ పి. ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేశాం. ఇటీవలే పాండిచ్చేరి, చెన్నైల్లో రెండో షెడ్యూల్ షూటింగ్‌ని పూర్తి చేశాం.

చిత్రంలోని ప్రధాన తారాగణమైన ఉదయ్, శ్వేత, ఆశిష్ విద్యార్థి, నళిని, రాజ్యలక్ష్మి, ఆర్తి, ఈశ్వర వరప్రసాద్, సుబ్బారావు తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. పాండిచ్చేరిలోని ఓ అద్భుతమైన గృహంలో చేసిన చిత్రీకరణ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. దీంతో 40శాతం చిత్రం షూటింగ్ పూర్తయ్యింది" అని చెప్పారు.

చిత్ర నిర్మాత సోమా విజయప్రకాష్ మాట్లాడుతూ.. ప్రేమను ఓ వైవిధ్యమైన కోణంలో ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పూర్తి వినోదాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉంటాయి.

ఈ నెలాఖరులో తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కొడైకెనాల్, పాండిచ్చేరి, చెన్నైల్లో కొనసాగే ఆ షెడ్యూల్‌లో పాటలు, కొంత టాకీ పూర్తి చేసి, తర్వాత హైదరాబాద్‌లో జరిగే ఫైనల్ షెడ్యూల్‌తో మొత్తం చిత్రాన్ని పూర్తి చేస్తాం" అని నిర్మాత వెల్లడించారు.

ఉదయ్‌కిరణ్, శ్వేతబసుప్రసాద్, ఆశిష్ విద్యార్థి, నళిని, రాజ్యలక్ష్మి, ఆర్తి, ఈశ్వర వరప్రసాద్, సుబ్బారావు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్ కోనేరు, ఎడిటింగ్: నందమూరి హరి, రచన: జనార్ధనమహర్షి, నివాస్, కెమెరా: రాఘవన్.