1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sexiest Asian women

Katrina Kaif | Sexiest Asian women | Eastern Eye | Laila Rouass | Hayat | Priyanka Chopra | Freida Pinto | Kareena Kapoor | కత్రినా సెక్సీ లుక్‌కి మరోసారి ఆసియా సలామ్

కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ సెక్సీ ఫిగర్‌ను తలదన్నేవారు 2009లోనతారస పడలేదు. చురకత్తిలాంటి చూపులతో గుచ్చిగుచ్చి చూసే కత్రినా కైఫ్ ప్రపంచంలో అత్యంత సెక్సీగా ఉండే 50 మంది మహిళల్లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె సెక్సీ అందాల ముందు ఎవరి అందాలు పోటీపడలేవని లండన్‌కు చెందిన "ఈస్టరన్ ఐ" పత్రిక నిర్వహించిన పోల్‌లో తేలింది. 

గత ఏడాది ఆసియా సెక్సీ మహిళల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కత్రినా ఈ ఏడాది కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

కత్రినా తర్వాత స్థానాలను బ్రిటన్‌కు చెందిన టీవీ నటి లైలా రౌవాస్, పాకిస్తాన్ నటి మెహవిష్ హయత్ ఆక్రమించారు. మిగిలిన స్థానాల్లో మన బాలీవుడ్‌కు చెందిన ప్రియాంకా చోప్రా, ఫ్రిదా పింటో, కరీనా కపూర్, బిపాసా బసు, లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకునే ఉన్నారు.

అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి కత్రినా ఆరోగ్యంగా లేదు. హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుదల సమస్కారణంగా ఆమె ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT