Hyderabad | MAA Dairy | Prasad labs | Akkineni Nageswara Rao | Murali Mohan | ప్రసాద్ ల్యాబ్స్‌లో "మా" డైరీ ఆవిష్కరణ
WD
డైరీని వెంట తీసుకుపోవడం కోసం పాకెట్ సైజులో వేస్తున్నాం. "మా" సేవా దృక్పథంతో ఇటీవల వరద బాధితులకోసం ఓ కార్యక్రమం నిర్వహించి 6 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. "మా" డైరీని గత ఏడాది సుజన్ గ్రూపు యాభైవేలకు స్పాన్సర్ చేశారు. ఈ ఏడాది కాపీలు పెరగడం వల్ల లక్షకు చేరింద"ని అన్నారు.
అక్కినేని మాట్లాడుతూ... "చాలా ఏళ్లుగా ఆర్టిస్టులకు సుళువుగా ఉండటంకోసం డైరీని ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైరీలో ఫోన్ నెంబర్ల వల్ల మాలాంటి వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రాత్రి పదిగంటల తర్వాత టీవీల్లో మేము నటించిన సినిమాలను చూసి ఎగ్జైట్ అయి నిద్రపోయేవారిని లేపి ఆ సినిమాలో బాగా చేశారని చెప్తుంటారు.
అంతేకాక నాగార్జున, సుమంత్‌కు అమ్మాయిలు ఫోన్లు చేసి నాగచైతన్య, సుశాంత్‌ల ఫోన్ నెంబర్లను అడుగుతుంటారు. నటునిగా నేను చివరి వరకూ నటిస్తూనే ఉంటాను" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల, గీతాంజలి, బాలయ్య, ఏవీఎస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫైట్ మాస్టర్ రాజు మృతికి ఒక నిమిషం మౌనం పాటించారు.