1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Harikrishna

Chiranjeevi | Harikrishna | Arya 2 | Adurs | చిరు, హరి కుటుంబాల సినిమాలను అడ్డుకుంటాం

చిరంజీవి
WD
సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణా సెగలు సినీ పరిశ్రమను కూడా తాకాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర వైపు మొగ్గుచూపడాన్ని తెలంగాణావాదులు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఆయన కుటుంబానికి చెందిన సినీతారల సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే వరంగల్‌లో ఆర్య-2 చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

చిరంజీవితోపాటు తెలుగుదేశం నాయకుడు నందమూరి హరికృష్ణ కూడా సమైక్యాంధ్రకు మద్దతు పలికిన నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం అదుర్స్‌ను థియేటర్లలో ఆడనివ్వబోమని తెలంగాణా మద్దతుదారులు అంటున్నారు.

ఇదిలావుండగా, రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టడం భావ్యం కాదని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలలో తలెత్తిన సంక్షోభానికి సినీ పరిశ్రమకు లింకుపెట్టి సినిమాలను అడ్డుకోవడం తగదని హితవు పలుకుతున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT