Mohan Babu | Actor | United Andhra Pradesh | Telangana issue, | మనం కలిసుందాం... కలిసుందాం: మోహన్ బాబు
WD
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేడు ఆంధ్రప్రదేశ్ యుద్ధభూమిలో ఉన్నది. దీని ఫలితంగా సామాన్యప్రజానీకం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు యువతను రెచ్చగొడుతున్నారు. ఫలితంగా కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని యూనివర్శిటీల్లో ఉన్న విద్యార్థులందరినీ నేను విన్నవించేదేమిటంటే... ఆత్మత్యాగం చేసుకుని తల్లిదండ్రులను క్షోభకు గురి చేయవద్దు. ఆవేశం వద్దు. శాంతియుతంగా పోరాడుదాం.
కొంతమంది దుష్ట రాజకీయ నాయకుల వల్ల నేడు మనకు ఈ కష్టం వచ్చింది. ఇది తెలంగాణా ప్రజలందరూ తెలుసుకోవాలి. తెలంగాణాలో 90 శాతం మంది తెలంగాణా కోరుకోవడం లేదు. వాళ్లను మభ్యపెట్టి కొంతమంది దుష్ట నాయకులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏమీ లేనివాడు ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిన వెంటనే కోట్లు... మంత్రి అయితే కోటానుకోట్లు. ఇదీ కొంతమంది రాజకీయ నాయకులు స్వరూపం.
తెలంగాణాకు నష్టం కలిగింది నిజమే.. మరి రాయలసీమ సంగతి... ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటి? రాయలసీమలో రాళ్లు తప్ప నీళ్లు లేవు.. ఉత్తరాంధ్రలో ఉపాధి లేదు. అందరికీ కష్టాలున్నాయి. పాలకులను అడుగుదాం. నిలదీద్దాం. సాధించుకుందాం.
ఈ రోజు ఉద్యమాలకు సారధ్యం వహించేవాళ్లను ఆత్మహత్య చేసుకోమనండి చూద్దాం. చేసుకుంటారా...? చేసుకోరని మీకు తెలుసు. యువత కొందరు దుష్ట నాయకుల మాటల భ్రమలో పడి ఆత్మత్యాగం చేసుకోవద్దు. సమైక్యాంధ్రకోసం కట్టుబడిన నేను ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. నా సినిమాలు ఆగిపోయినా ఫర్వాలేదు. ఆంధ్ర రాష్ట్రం సుఖశాంతులతో ఎప్పుడు ఉంటుందో అప్పుడే నా సినిమాలు విడుదల చేస్తాను.
శాంతియుతంగా పోరాటం సాగిద్దాం. ఆస్తులను ధ్వంసం చేయొద్దు. కేంద్రం సమైక్యాంధ్రకు అనుగుణంగా నిర్ణయం చెప్పేవరకూ పోరాడుదాం. ప్రాణత్యాగం చేసుకోవద్దు. మీరందరూ దేశాన్ని ఉద్ధరించాలి. భవిష్యత్ మీదే. నిండు నూరేళ్లు మీరందరూ చల్లగా ఉండాలి" అన్నారు.