1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Hot Actress

Actress Ileana | Hot Actress | Sexy | Actor | Relations | హీరోలతో రిలేషన్స్ కోసం రాలేదు: ఇలియానా

ఇలియానా
తను ఇండస్ట్రీకి హీరోలతో రిలేషన్స్ మెయింటెయిన్ చేయడానకి రాలేదని, తనకిచ్చిన పాత్రను చేసేందుకే వచ్చాననీ స్లిమ్ బ్యూటీ ఇలియానా చెబుతోంది. ఇటీవలే ఆమె నటించిన సలీమ్ విడుదలైంది. ఈమధ్య హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్‌లో ఓ బేకరీని ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ఆమె తనను అడిగిన ప్రశ్నలకు స్పందించింది. 

ఇండస్ట్రీలో ఎటువంటి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారని అడిగినప్పుడు... "నటించడం నా వృత్తి. పాత్రకు న్యాయం చేయాలనే చూస్తాను. మన పని మర్చిపోయి రిలేషన్స్ పెంచుకోవాలని నాకు లేదు. అలా అని రిలేషన్స్ అనవసరం అని నేను చెప్పను" అంటోంది.

అంటే.. అంటీ అంటనట్లుగా ఉంటుందన్నమాట. సలీమ్‌లో ఎక్స్‌పోజింగ్ గురించి ప్రస్తావిస్తూ... అది పాత్రమేరకే చేయాల్సి వచ్చింది అని చెప్పింది. దేవదాసు చిత్రాన్ని చూసిన యూత్‌ బాగానే ఎంజాయ్ చేశారు కదా... అంటూ తను ఎక్స్ పోజింగ్ చేయడానికి వెనుకాడనని నిర్మొహమాటంగా చెబుతోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT