Fruit salad | 7 Prema kathalu | Siya Gowtham | Title | "7 ప్రేమ కథలు"గా మారిన "ఫ్రూట్ సలాడ్"
ప్రేమ కథలను ఎప్పటికప్పుడు నవ్యతగా చూసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. సెవన్ హిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శియా గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న "ఫ్రూట్ సలాడ్" చిత్రం "7 ప్రేమ కథలు"గా టైటిల్ మార్చుకుంది. ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
నిర్మాత ఇనగడప సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రేమ అన్న పదం ప్రతి మనిషిలో ఓ తియ్యని అనుభూతిని కల్గిస్తుంది. ఆడవాళ్లైనా, మగవాళ్లైనా.. "ప్రతి మనిషి ఏదో ఒక రోజున ప్రేమబారిన పడాల్సిందే. ప్రేమనుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే కొందరు గెలుస్తారు. మరికొందరు ప్రేమ జ్ఞాపకాలతో గడిపేస్తారు. కొందరికి తీపి, మరికొందరికి చేదు. ఇలా ఎన్నో అనుభవాలు. తొలిచూపులో ప్రేమ, త్యాగం, విరహం, సంఘర్షణ, స్పర్శ, బంధం ఈ గుణాలనే ఏడు ప్రేమకథలుగా మలచిన "ఏడు ప్రేమకథలు" చిత్రం తొలికాపీ సిద్ధమైంది" అని చెప్పారు.
దర్శకుడు సురేష్ మాట్లాడుతూ.. "తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఏడు ప్రేమకథల్ని ఒకే చిత్రంలో చూపించడం, ఓ వైవిధ్యమైన ప్రయోగం. ఈ ఏడు కథలు ప్రతీ యువతీయువకుల మనోభావాలకు అతి దగ్గరగా ఉంటాయి. మిగతా నటీనటులు కొత్తవారైనప్పటికీ, ప్రతి కథలో వున్న పాత్రలో చక్కగా ఇమిడిపోయారు" అని చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి సమర్పణ: బేబి నేహశ్రీ, శ్రీమతి వీణాధరి మాటలు: ఓం ప్రకాష్ మార్తా, పాటలు: అశోక్ తేజ, మాచవరం ప్రవీణ్, సిరాశ్రీ కెమెరా: ఎ.ఎమ్. విజయ్, సంగీతం: సత్యా వై., సహ నిర్మాత: రవికుమార్ పనస, నిర్మాత: ఇనగడప సతీష్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్.
