1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Movie

Teliyadu | Movie | Audio | Sarat | Nagateja | Santosh Parlalour | వెరైటీ లవ్‌స్టోరీ "తెలియదు" ఆడియో ఆవిష్కరణ

తెలియదు
కేమ్ ఫ్రెండ్స్ అకాడమీ పతాకంపై హండ్రెడ్, శరత్, నాగతేజ, సంతోష్ పార్లలార్, అలేఖ్య హీరోహీరోయిన్లుగా డాక్టర్. రాజిరెడ్డి గుఱ్ఱం దర్శకత్వంలో రూపొందిన వెరైటీ లవ్‌స్టోరీ "తెలియదు". ఈ చిత్రం ఆడియో వేడుక ఇటీవలే వైభవంగా జరిగింది. తొలి సీడీని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. మలిసీడీని రచయిత సుద్దాల అశోక్ తేజకు అందజేశారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జ్యోతిప్రియ గుఱ్ఱం మాట్లాడుతూ.. "నేటి యువతీ యువకుల మనోభావాలకు అడ్డంపట్టే మంచి చిత్రమిది. నలుగురు కుర్రాళ్ళ జీవితాలను ఓ యువతి ఎలా ప్రభావితం చేసిందనే ఇతివృత్తాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలోని ఆరు పాటలకు అద్భుతమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నారు.

ఇంకా కార్యక్రమంలో చిత్ర సమర్పకులు భారతి చంద్రశేఖర్, కెమెరామెన్: ఆనందరావు. డి. కొరియోగ్రాఫర్: ప్రసాద్, మైత్రి ఆడియో అధినేత త్రినాథ్‌లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M