Ram Gopal Varma | Lagadipati Raja Gopal | United Andhra | అవును.. నేను కూడా లగడపాటి లానే...: వర్మ
WD
ఇటీవల లగడపాటి ఓ మీడియా ఇంటర్వ్యూలో తను, రామ్‌గోపాల్ వర్మ పాతికేళ్ల క్రితం స్నేహితులుగా ఉన్న నాటి పరిస్థితులను ఒక్కసారి నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తామిద్దరం ఓ సమస్యపై హైదరాబాద్‌కి వెళ్లిన సందర్భాన్ని, అక్కడ ఓ ఎకౌంట్‌ను సెటిల్ చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. వర్మ ఎంతో ధైర్యవంతుడనీ, తను చెప్పదలచుకున్నదీ ధైర్యంగా చెప్పి ఒప్పిస్తాడని లగడపాటి కితాబు ఇచ్చాడు.
లగడపాటి వ్యాఖ్యలను చూసిన వర్మ తన మిత్రుడు లగడపాటిదీ, తనదీ ఒకేరకమైన మనస్తత్వం అనీ, ఒక విషయంపై నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయమని అన్నారు. ప్రస్తుతం లగడపాటి సమైక్యాంధ్రకై ఉద్యమం చేయడాన్ని తను సమర్థిస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ చెప్పారు.