1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Priyamani

Jagapati Babu | Priyamani | Sadhyam | జగపతి బాబు, ప్రియమణిల "సాధ్యం"

జగపతిబాబు
జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతున్న చిత్రం సాధ్యం. కుమార్ బ్రదర్స్ సినీ పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో చివరి షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ... వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సాధ్యం అనే టైటిల్ నూరుశాతం సరిపోతుంది. 

ఈ నెలాఖరు వరకూ ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది. జనవరిలో పాటలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆది చిత్రం ఫేం కీర్తిచావ్లా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తోందని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... ఇప్పటివరకూ జగపతిబాబు తన కెరీర్‌లో పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. ప్రియమణిది కూడా అభినయానికి ఆస్కారమున్న పాత్ర.

హీరోహీరోయిన్ల పాత్రల ఔచిత్యం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలకు ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. అత్యంత భారీ ఖర్చుతో ఎక్కడా రాజీపడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకముంది అన్నారు.

తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, యుపిరాజు ప్రగతి, మధుమణి, మున్నా, వేణు, సత్తెన్న తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే: మారో పళని, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT