1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Telangana

KCR, Mohan Babu | Telangana | United Andhra | Hyderabad | Cinema | కేసీఆర్‌కు సరైన మొగుడు మోహన్ బాబే

కేసీఆర్
WD
దేనికైనా ఢీ అంటే ఢీ అనేవాడుంటేనే పస తెలుస్తుంది. మంగళవారంనాడు తన కుమారుని షూటింగ్‌పై దాడిచేసిన తెరాస కార్యకర్తలపై- కేసీఆర్‌పైనా వాగ్భాణాలు సంధించిన మోహన్ బాబుపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిన్నరాత్రి తెలంగాణా నాయకులు కూడా మోహన్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం విశేషం. మధుయాష్కితోపాటు పలువురు నాయకులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు.

ఇప్పటివరకూ చిరంజీవి తర్వాత సమైక్యాంధ్ర అంటూ ముందుకు వచ్చిన మోహన్ బాబుపై ఇండస్ట్రీ ఒక్కసారిగా కొమ్ముకాస్తోంది. రియల్ లైఫ్‌లో కూడా డేరింగ్‌గా ఉండే మోహన్ బాబు వ్యక్తిత్వం నిన్న జరిగిన పరిణామాల నేపధ్యంలో కేసీఆర్‌కు సరైన మొగుడువి నువ్వేనని మెచ్చుకుంటున్నాయి సినీ వర్గాలు. మరోవైపు తెలంగాణా నిర్మాతలు దర్శకులు కూడా కేసీఆర్ నోటి దురుసు వల్ల తమకు అవమానం జరిగినట్లు భావిస్తున్నారు.

ఇప్పటివరకూ ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవి అనే రెండు వర్గాలున్నాయనేది తెలిసిందే. కానీ మారిన రాష్ట్ర పరిస్థితుల రీత్యా అంతా ఒక్కటయ్యే పరిణామం సంభవించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు చిరంజీవి ఫోన్ చేసి విషయాలు తెలుసుకున్నారు. లక్ష్మీప్రసన్నకు జరిగిన అవమానం తన కుమార్తెకు జరిగిన అవమానంగా భావిస్తున్నాని చిరంజీవి మోహన్ బాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మీ ప్రసన్న కాస్త ఉద్వేగానికి లోనయ్యారని తెలిసింది.

అసలు ఈ దాడికి కారణమేమిటి?
మోహన్ బాబు సమైక్యాంధ్ర అంటూ నినాదం ఇవ్వడమే తెరాస కార్యకర్తల దాడికి అసలు కారణం. మోహన్ బాబు కుమారుడు విష్ణు నటించిన సలీమ్ చిత్రాన్ని తెలంగాణాలో నిలిపివేశారు. తెలంగాణా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఈ ఉదంతంపై ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మోహన్ బాబు విద్యాసంస్థలు హైదరాబాదులో ఉండటంతో వాటిపైనా దాడి జరిగింది. దీంతో సమైక్యాంధ్ర నినాదంతో మోహన్ బాబు రంగంలోకి దిగారు. తిరుపతిలో ఒక్కరోజు దీక్షలో కూర్చున్నారు. సలీమ్ చిత్రాన్ని ఆంధ్రా సరిహద్దుల్లో ఆపేయమనండి చూస్తానని సవాల్ విసిరారు. అదేకాకుండా హైదరాబాదులోనే షూటింగ్ చేస్తా. దమ్ముంటే ఆపండని మరో సవాల్ విసిరారు. దానికి పర్యవసానమే మంగళవారం తెరాస జరిపిన దాడి.

నాలుక కోస్తామంటే సభ్యతా...?
నాలుక కోస్తా అని ఒక నాయకుడు, మేధావి అంటే దాన్ని సభ్యత అంటారా...? నేను ఎక్కడా వినలేదు. ఆయనపై కేసు వేయడానికైనా సిద్ధమేనని మోహన్ బాబు కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బుధవారంనాడు ముఖ్యమంత్రిని కలిసి తన శాంతియాత్రకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. దానికి రెండు రోజుల సమయం తనకు ఇవ్వమని రోశయ్య బదులిచ్చారు.

మళ్లీ అక్కడే షూటింగ్ చేస్తా...!
ఇప్పటికే కొంపల్లిలోని భవంతిలో షూటింగ్ కోసం కొంత డబ్బును చెల్లించాం. ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేయాలని వచ్చారు. అదంతా వేస్ట్ అయింది. ఇల్లు చాలా ధ్వంసమైంది. అదంతా సెట్ అయితే ఈరోజే మళ్లీ అక్కడ షూటింగ్ చేస్తానని మోహన్ బాబు అన్నారు.

అమెరికా ఇచ్చిన గౌరవం తెలుగువారు ఇవ్వరా...: లక్ష్మీప్రసన్న
నేను పదేళ్లు అమెరికాలో ఉన్నాను. అక్కడ ప్రభుత్వం ఎంతో గౌరవించింది. నా చదువుకు సహకరిస్తానని కూడా హామీ ఇచ్చింది. అలాంటిది తెలుగు అమ్మాయినైన నాకు తెలుగు రాష్ట్రంలో లభించే గౌరవం ఇదేనా...? అని లక్ష్మీ ప్రసన్న సూటిగా ప్రశ్నించింది. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి తెరాస వారు అడ్డంగా నరికేస్తాననే నినాదాలతో లోపలికి వచ్చారు.

పోలీసులు ముగ్గురు వచ్చారు. వారితోపాటే ఓ ఫోటోగ్రాఫర్ డిజిటల్ కెమేరాతో తీస్తుంటే వారించాం. దాంతో ఆయన నా చేయి పట్టుకుని లాగాడు. అతను జర్నలిస్టో కాదో కూడా నాకు తెలీదు. అది చూశాక మనోజ్ అతడిని ఎదుర్కొన్నాడు. అంతేకానీ, జర్నలిస్టులపై ఎదురు తిరగలేదు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT