1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Feature film

Micro Finance | Feature film | Drive | Home | Message | ఫ్యూచర్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్న మదురై మైక్రో ఫైనాన్స్!

ఫ్యూచర్ ఫిల్మ్
Srini
WD
తమిళనాడుకు చెందిన మదురా మైక్రో ఫైనాన్స్ సంస్థ సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపు (స్వయం సహాయ బృందాలు)లకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఒక వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. మదురైకు చెందిన ఒక మహిళా స్వయం వృద్ధి ఆధారంగా చేసుకుని 'శక్తి పిరక్కుదు' అనే ఫ్యూచర్ ఫిల్మ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ సంస్థ ఫ్యూచర్ ఫిల్మ్ నిర్మించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ప్రకృతి జీవా మీడియాకు చెందిన ఫిల్మ్ మేకరు ఉషారాజేశ్వరి ఆధ్వర్యంలో దీన్ని నిర్మిస్తున్నారు. మదురైతో పాటు.. దాని పరిస ప్రాంతాల్లో ఉన్న అనేక మంది స్వయం సహాయ బృందాలకు చెందిన మహిళల నిజమైన జీవిత గాధను ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్నారు.

ఇందులో ఎస్‌హెచ్‌జీకి చెందిన మహిళలు వివిధ పాత్రలను పోషించనున్నారు. అమోరికాలోని ప్రొఫెసర్ మధు విశ్వనాధన్ సహాయ సహకారంతో మహిళల్లో వ్యాపార పోటీ తత్వాన్ని పెంచడం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. దీనిపై ఆ ప్రాజెక్టు ఛైర్ పర్సన్ డాక్టర్ తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. చిన్నపాటి రుణం తీసుకునే అవకాశం సుందరి అనే మహిళకు కలిగింది.

అయితే, ఆమెకు ఇంతకుముందు ఎలాంటి వ్యాపార అనుభవం లేదు. టైలరింగ్ విద్య మాత్రం ఉంది. పలు చిన్న గ్రామాల్లో నివశించే ఓ సాధారణ మహిళ. భర్త మాత్రం ఆమె నుంచి డబ్బులు అడుతుంటాడు. ఈ పరిస్థితులను అధికమించి తాను ఎం చేసిందనేది ఈ ఫ్యూచర్ ఫిల్మ్ సారాంశంమన్నారు.

మైక్రో ఫైనాన్స్ సంస్థ ఇలాంటి మహిళలకు అండగా నిలువడమే కాకుండా, వారిలో వ్యాపార తృష్ణ ప్రేరేపించి, ప్రగతిపథంలో పయనించేలా కృషి చేస్తోందన్నారు. ఈ ఫిల్మ్‌లో నాలుగు లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులను చూపించినట్టు చెప్పారు.
About Writer
PNR