Allu Aravind | TRS, Mohan Babu | Allu Arjun | Varudu | Cinema | కార్యకర్తల చిల్లరపనులను తెరాస అడ్డుకోవాలి: అల్లు అరవింద్
FILE
అక్కడకు కొంతమంది 18-20 సంవత్సరాలలోపు వయస్సుగల కుర్రాళ్లు వచ్చి అల్లుఅరవింద్ ఏడీ? అని అడిగారనీ, షూటింగ్ ఇప్పుడు కాదంటే.. వెళుతూ.. జై తెలంగాణా అంటూ నినాదాలు చేశారని ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. వెంటనే వెంకటేశ్వరరావు అల్లుఅరవింద్‌కు ఫోన్ చేయడంతో అల్లుఅరవింద్ తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
నిన్న జరిగిన దాడికి వెంటనే కళాకారులంతా ఒక్కటై వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని అల్లు అరవింద్ అన్నారు. దాడులు రెండు, మూడు సినిమా షూటింగ్‌లకు మాత్రమే అనుకుంటే పొరపాటని, ఇప్పటికైనా ఫిలిమ్ ఛాంబర్ పెద్దలు ముందుకువచ్చి తగిన విధంగా స్పందించాలని హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తలను చిల్లర పనులు చేయకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుకోవాలని అల్లు అరవింద్ సూచించారు.