Mahesh Babu | Cinema | KCR | TRS | మహేష్ సినిమా కిలాడి షూటింగ్‌పై దాడి: రూ. కోటి నష్టం
WD
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్. రమేష్ బాబు నిర్మతగా మహేష్ బాబు, అనుష్క జంటగా నటిస్తున్న కిలాడి సినిమాకోసం అనంతగిరిపల్లి సమీపంలోని గెరేట్ పల్లి గ్రామంలో వేసిన సెట్టింగ్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో నిర్వాహకులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ సంఘటనలో రెండు డీసీఎంలు, ఒక సుమో తగలబడిపోయాయి.
కోటి రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదిలావుండగా హైదరాబాదులోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌పై తెరాస కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలకు సినిమాలకు లింకుపెట్టి దాడులకు తెగబడటం శోచనీయమని తెలుగు సినిమా ప్రముఖులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు.