1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Trivikram Srinivas | Cinema | TRS | తెరాస కార్యకర్తల దాడి: త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పరుగులు

త్రివిక్రమ్ శ్రీనివాస్
తెలుగు సినీ పరిశ్రమలో సీమాంధ్రకు చెందిన నటులు, దర్శకులు, రచయితలను... ఇలా ఒక్కొక్కరిపై విడివిడిగా దాడి చేస్తున్నారు తెరాస కార్యకర్తలు.

గురువారం ఉదయం దిల్‌షుక్‌నగర్‌లో రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయాణిస్తున్న వాహనంపై తెరాస కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో శ్రీనివాస్ వాహనం దిగి పరుగు లంకించుకున్నారు. మొత్తమ్మీద హైదరాబాదులోని తెలుగు సినీపరిశ్రమపై తెరాస టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

సినీ నటులు, దర్శకులపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో అందరూ కలిసి రావాలని అల్లు అరవింద్ పిలుపునిచ్చారు. దాడులను ముక్త కంఠంతో ఖండించాలన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT