1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. E.V.V. Satyanarayana

Aryan Rajesh | E.V.V. Satyanarayana | Aishwarya | Comedy | Entertainer | జనవరి 1 నుంచి ఇ.వి.వి- ఆర్యన్ రాజేష్‌ల కొత్త చిత్రం!

ఆర్యన్ రాజేష్
WD
హిట్ చిత్రాల దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ కొత్త సంవత్సరంలో తన తదుపరి చిత్రానికి సమాయత్తమవుతున్నారు. బిగ్‌బి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ హీరోగా, ఐశ్వర్య (పరిచయం) హీరోయిన్‌గా నటించనున్నారు.

రెండున్నర గంటల పాటు నాన్‌-స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే "బెండు అప్పారావు ఆర్.ఎం.పి" వంటి హాస్యభరిత చిత్రాన్ని అందించిన ఈవీవీ తాజాగా ఈ చిత్రాన్ని ఇప్పటివరకు తీసిన కామెడీ చిత్రాల్లో అత్యుత్తమైనదిగా నిలిచేందుకు స్క్రిప్టును సిద్ధం చేసుకున్నారు.

జనవరి ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్, రామోజీ ఫిలింసిటీల్లోనూ, ఫిబ్రవరిలో బ్యాంకాక్‌లొ కొంత టాకీని, కొన్ని పాటల షూటింగ్‌కు సన్నాహాలు చేసినట్లు ఈవీవీ సత్యనారాయణ విలేకరులతో అన్నారు. చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రముఖ హాస్యనటులంతా ఈ చిత్రంలో నటించడం విశేషమని ఆయన చెప్పారు.

ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానంజం, చలపతిరావులతో పాటు కోవై సరళ, రఘుబాబు, థాయ్ పిల్ల (థాయ్‌లాండ్ అమ్మాయి), జయప్రకాష్ రెడ్డి, శకుంతల (డ్యూయెల్ రోల్), కృష్ణభగవాన్, అనితానాగ్, అలీ-లావణ్య జ్యోత్న్స, జీవా-సన, ఎల్బీ శ్రీరామ్-సురేఖావాణి, శివారెడ్డి-అల్లరి సుభాషిణి, సుమన్‌శెట్టి-హేమ, తిరుపతి ప్రకాష్-గీతాసింగ్‌లు జతకట్టనున్నారు.

ఇంకా ఈ చిత్రంలో ఏవీఎస్, గుండు సుదర్శన్, చిట్టిబాబు, పొట్టి వీరయ్య బెనర్జీ, విక్రమ్, కళ్లు కృష్ణారావు, కళ్లు చిదంబరం, గౌతంరాజు, బ్యాంకాక్ బాబీ, జయలలిత తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు: జనార్ధనమహర్షి, రచనా సహకారం: వేగేశ్నసతీష్, మోహన్, శ్రీనివాస్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కెమెరా: శ్రీనివాసరెడ్డి, సంగీతం: కోటి, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: నందు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ.
About Writer
SELVI.M