1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. పాపం తెలంగాణా ప్రేక్షకులు... ప్చ్!!!

Telangana, Cinema, Avatar, Balakrishna, Audience | పాపం తెలంగాణా ప్రేక్షకులు... ప్చ్!!!

తెలంగాణా
WD
అటు తెలంగాణా లొల్లి... ఇటు సమైక్యాంధ్ర గోల. వీటి మధ్య వినోదాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్న ప్రేక్షకులకు... ప్రత్యేకించి తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకు ఏం తోయడం లేదు. సినిమాకెళ్దామంటే బంద్‌లతో సినిమా హాళ్లు మూతపడి మూలుగుతున్నాయాయె. దాదాపు హీరోలందరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడంతో తెలంగాణాలో వారి చిత్రాలను చూస్తే ఎక్కడ ఏ ఆకతాయి గడుగ్గాయిలా మారి నానా రభస చేస్తాడోనని తెలంగాణా ప్రేక్షకులు గత నెలరోజులుగా సినిమాలకు దూరమయ్యారంటే నమ్మండి.

దీంతో ఏం చేయాలో పాలుపోని తెలంగాణా ప్రేక్షకుడు హాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న సినిమాలను భారీ హీట్ చేసి పారేస్తున్నాడు. కొందరైతే మన తెలుగు హీరోలు... సారీ!!! సీమాంధ్ర హీరోలు హాలీవుడ్ చిత్రాల్లో తమ ఆనవాళ్లు కనిపించకుండా మాస్క్‌లవంటివి ధరించి చిత్రాలు చేసుకుంటే, కనీసం వాటిని చూసైనా తృప్తి చెందుతామని ఫన్నీ మాటలు చెప్పుకుంటున్నారు.

మరికొందరైతే ఇటీవల టైటానిక్ ఫేమ్ జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ చిత్రంలో మన బాలయ్య అయితే ఎలా ఉంటాడో... అని ఆలోచన చేసిందే తడవుగా యువరత్నను ఆ ఫోజులో యానిమేషన్ చేసి ఆ ఫోటోలను తమ తమ సర్కిళ్లలో పంపిణీ చేసుకుని ఆనందాన్ని పొందుతున్నారు. పాపం తెలంగాణా ప్రేక్షకులు... బంద్‌లు, ఆందోళనలతో కూలీ, నాలీ పోవడమే కాక చివరికి మనసారా నవ్వుకునేందుకు కావలసిన వినోదం కూడా అందకుండా పోతోంది. ప్చ్....
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT