1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Karthi Sivakumar

Yuganiki Okkade | Karthi Sivakumar | Rema Sen | Andriya Jeromiya | Venkatesh | జనవరిలో "యుగానికి ఒక్కడు" ఆడియో!

యుగానికి ఒక్కడు
WD
గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని, ఎం.యం. రత్నం తనయుడు రవికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ "7/జి బృందావన్ కాలనీ" వంటి మరో సెన్సేషనల్ హిట్ ఫిల్మ్‌ని ప్రేక్షకులకు అందించిన ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వాన "యుగానికి ఒక్కడు" అనే మరో సూపర్ హిట్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆర్. రవీంద్రన్ సమర్పణలో, డ్రీమ్ వేలీ కార్పొరేషన్ పతాకంపైన ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆర్. రవీంద్రన్ "యుగానికి ఒక్కడు" సినిమా గురించి చెబుతూ.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన రెండు సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వం వహించిన అత్యంత భారీ చిత్రమిదన్నారు. సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ క్రేజీ చిత్రాన్ని హైదరాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీ, కేరళలోని చాలకుడి, రాజస్థాన్‌లోని జైసీన్మర్ ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి దర్శకుడు రూపొందించారని చెప్పారు.

ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య సోదరుడైన కార్తీ శివకుమార్ ఇందులో హీరోగా నటించగా రీమాసేన్, ఆండ్రియా జెరోమియా కథానాయికలుగా నటించారు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకుగాను సర్వసన్నాహాల్ని జరుపుతున్నామని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రీ-రికార్డింగ్, మిక్సింగ్ కార్యక్రమాల్ని ఆ తర్వాత డీటీఎస్‌ని పూర్తిచేసి జనవరి మొదటి వారంలోగా తొలికాపీని సిద్ధం చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నామన్నారు.

అతి త్వరలో ఆడియో విడుదల:
యుగానికి ఒక్కడు ఆడియోను జనవరి మొదటివారంలోనే ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా విడుదల చేస్తామని ఆర్. రవీంద్ర అన్నారు. దర్శకుడు శ్రీ రాఘవ దీన్ని ఎంతో శ్రమించి రూపొందించారు. చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా, 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించామని చెప్పారు.
WD


సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్‌గా అన్ని కమర్షియల్ విలువలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హీరోగా కార్తీ శివకుమార్ ఒక అద్వితీయమైన పాత్రను పోషించారని సమర్పకులు వెల్లడించారు. దీన్ని సంక్రాంతికి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

కార్తీ శివకుమార్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో రీమాసేన్, ఆండ్రియా జెరోమియా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్తీబన్, ప్రతాప్ పోతన్‌లు ఇతర పాత్రల్ని పోషించారు.

శ్రీరామకృష్ణ సంభాషణలను సమకూర్చుతున్న ఈ చిత్రానికి భువన చంద్ర, అనంత శ్రీరామ్, గీత రచయితలు: సంగీతం: జి.వి. ప్రకాష్, ఛాయాగ్రహణం: రామ్‌జీ, ఎడిటింగ్: కోలాభాస్కర్: ఫైట్స్: రాంబోరాజ్ కుమార్, కళ: సంతోషం, నృత్యాలు: శివశంకర్, కళ్యాణ్ వద్ద పనిచేసిన సాంకేతిక వర్గం.
About Writer
SELVI.M