Telangana | Cinema | Seemandhra | Media | TV | మీ బాంచన్ కాదు... మీ పీక నొక్కుతాం
"బాంచన్ నీ కాల్ మొక్తా... ఇంకెన్నాళ్లు" అనే పేరుతో సినిమా తీస్తున్నట్లు తెలంగాణాకు చెందిన నిర్మాత యశ్వంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా 'మా తెలంగాణా అసోసియేషన్', 'తెలంగాణా మీడియా అసోసియేషన్', 'తెలంగాణా ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' అంటూ తెలంగాణా ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీలను నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు.
అంతవరకూ ఓపికగా అన్ని విషయాలను విన్న పాత్రికేయులు అసోసియేషన్‌ల సంగతి మాకొద్దనీ, సినిమా వివరాలను చెప్పమని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన యశ్వంత్ సినీ విలేకరులపై విరుచకపడ్డారు. ఇక్కడ తాము చెప్పేదే మీరు వినాలంటూ హుకుం జారీచేశారు. చిరంజీవి, మోహన్ బాబులు ప్రెస్ మీట్ పెడితే ఇలాగే ప్రశ్నిస్తారా...? అని గద్దించి అడిగారు. దానికి పాత్రికేయులు.. తమకు ఎవరైనా ఒకటేననీ, కావలసిన సమాచారం మాత్రమే ఇవ్వాలని చెపుతామని తెలిపారు. ఈలోపు తెలంగాణా ప్రాంతానికి చెందిన యాదగిరి అనే నాయకుడు వచ్చి, పాత్రికేయులను నానా మాటలు అనడం మొదలుపెట్టారు.
సీమాంధ్రకు చెందిన మీడియా తట్టాబుట్టా సర్దుకుని తక్షణమే వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇంకా ఎవరైనా తెలంగాణా చూరుబట్టుక వేళాడితే వెళ్లగొట్టడం ఖాయమని ఎగిరి పడ్డారు. ఆ పిదప కోపంతో ఊగిపోతూ.. ఐ న్యూస్ మీడియాకు చెందిన కెమేరాను ఎత్తి కిందపడేసి ముక్కలు చేశారు. ఈ పరిణామంతో సినీ పాత్రికేయులు నివ్వెరపోయారు. మీడియా సమావేశానికి పిలిచి ఇలా దాడి చేయడం భావ్యం కాదని నిరసన తెలిపారు.
అయితే అదేమీ పట్టించుకోని యశ్వంత్, యాదగిరిలు తెలంగాణాలో ఉన్న ఆంధ్ర హీరోల షూటింగ్‌లను భవిష్యత్తులో కూడా అడ్డుకుంటామనీ, తెలంగాణా గడ్డపై సీమాంధ్ర హీరోలు సినిమాలు చేయలేరనీ, తమకు తెలంగాణా వచ్చేసిందని వీరంగం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది.