1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Adurs

NTR | Adurs | New Year Calendar | V. V. Vinayak | Nani | ఎన్టీఆర్ చేతుల మీదుగా "అదుర్స్" క్యాలెండర్ ఆవిష్కరణ

ఎన్టీఆర్
WD
నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వల్లభనేని నిర్మించిన భారీ చిత్రం "అదుర్స్" సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

"అదుర్స్" విడుదల సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం రూపొందించిన "అదుర్స్" న్యూ-ఇయర్ క్యాలెండర్‌ లాంఛనంగా విడుదలైంది. అభిమానుల సమక్షంలో హీరో ఎన్టీఆర్, వి.వి.వినాయక్, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)లు "అదుర్స్" న్యూ-ఇయర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు వి. ప్రతాప్‌రెడ్డి (నెల్లూరు), ఎన్.జీవన్ (కర్నూలు), చౌదరి, ఎం. నరసింహులు రాజుయాదవ్, ఇమ్మానుయేల్ (హైదరాబాద్) తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M