1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Genelia

Ramcharan Teja | Genelia | Magadheera | Nagendra Babu | Bommarillu Bhaskar | సిడ్నీలో రామ్‌చరణ్, జెనీలియాల కొత్త చిత్రం!

రామ్చరణ్ తేజ
WD
ప్రతిష్టాత్మక అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.7గా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా, జెనీలియా, షాజన్ పదంసి హీరోయిన్లుగా రూపొందిస్తున్న మెగా మూవీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి సిడ్నీలో షూటింగ్‌ జరుపుకోనుంది.

కె. వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాలను నిర్మాత నాగేంద్రబాబు తెలియజేస్తూ.. "తొలి షెడ్యూల్ ముంబైలో డిసెంబర్ 11 నుంచి 20వరకు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఫిబ్రవరి మొదటివారం నుంచి సిడ్నీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

మా బ్యానర్‌లో హైటెక్నికల్ వాల్యూస్‌తో, కాంప్రమైజ్ అన్న పదానికి తావివ్వకుండా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగు వంటి హిట్ చిత్రాల తర్వాత భాస్కర్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అలాగే అందరి అంచనాలను మించే విజయాన్ని సాధించే విధంగా మా చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అని చెప్పారు.
WD


బ్రహ్మానందం, ప్రభు, సుమన్, ప్రగతి, కిషోర్, ప్రణీత్, కల్పిక, ప్రగతిక తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ రెడ్డి, సంగీతం: హారిస్ జైరాజ్, పాటలు: వనమాలి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఫైట్స్: పీటర్ హెయిన్స్.

ఇంకా కొరియోగ్రాఫర్: బోస్కో కేసర్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, మాటలు : తోటప్రసాద్, మేకప్: శివ, కాస్ట్యూమ్స్: షాజీ, స్టిల్స్: గుణ, కో-డైరక్టర్స్: ప్రణదీప్, పీవీవీ సోమరాజు, ప్రొడక్షన్ కంట్రోలర్ : మోహన్, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్, నిర్మాత: కె. నాగేంద్ర బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.
About Writer
SELVI.M