Buridi | EVV Satyanarayana | Aryan Rajesh | Aiswarya | "బురిడి" తెగ నవ్వించేస్తాడు
WD
దర్శకుడు మాట్లాడుతూ... మంచి సబ్జెక్ట్. రెండున్నర గంటలపాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది. ఇంతకుముందు ఎమోషన్, సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. కానీ ఈ సినిమా మాత్రం పూర్తిస్థాయి కామెడీగా రూపొందిస్తున్నాం. ఇది నా యాభవ సినిమా. ఐదు నెలలు కష్టపడి ఈ కథను తయారు చేశాము. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. నెలాఖరుతో హైదరాబాద్, ఫిలింసిటీలో జరిగే షెడ్యూలుతో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది.
ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకాక్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. ముప్పై మందిని బ్యాంకాక్ తీసుకెళుతున్నాం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో బురిడి కొట్టడమో, కొట్టించుకోవడమో జరుగుతుంది. ఈ సినిమాలో ప్రతి పాత్ర బురిడికి లోనవుతుంది. మే నెలలో సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.
ఈ చిత్రంలో ఎంఎస్ నారాయణ, రఘుబాబు, అలీ, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, ఎల్బీశ్రీరాం, కృష్ణభగవాన్, తిరుపతి ప్రకాష్, బెనర్జీ తదితరులు నటించారు.