Raviteja | Sambho shivashambho | Audio | రవితేజ "శంభో శివశంభో" ఆడియో విడుదల
WD
రవితేజ మాట్లాడుతూ... ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అందరూ పాత్రలపరంగా చక్కగా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదల కానున్నదని తెలిపారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... రవితేజతో నేను చేసిన ఆటోగ్రాఫ్ సినిమా ఎంతో కీర్తిని సంపాదించి పెట్టింది. యుఎస్ వెళితే ఆ సినిమా మీరే చేశారా అంటూ అక్కడివారు నన్ను సన్మానించారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాగా రవితేజతో సినిమా తీశాను.
స్నేహం కోసం సాయం చేస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనేది చిత్ర కథాంశం. సముద్రఖనిని మరో తెలుగు చిత్రం చేయమని అడిగాను. చేస్తానన్నారు. ఈ సినిమా మూడు రోజుల్లో తొలికాపీ సిద్ధం కానుంది. ఈ నెల 14న సినిమా విడుదల చేస్తామన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ... ఈ చిత్రం తమిళంలో నాడోడిగళ్ నేను చూశాను. మంచి ఫీల్ ఉన్న చిత్రం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సునీల్, సంగీత దర్శకుడు సుందర్.సి బాబు పాల్గొన్నారు.