Junior NTR | Telangana Citizen | Telanagana MAA | జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రవాడు కాదు.. మా తెలంగాణావాడే!!
WD
కొత్తగా ఏర్పాటైన తెలంగాణా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు సీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... గత కొద్ది రోజులుగా చలనచిత్ర రంగంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ... అవి ఏర్పడటానికి గల కారణాలను తెలియజేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే పుట్టిపెరిగాడనీ, అందుకే అతను మావాడేనని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఎక్కడికో తరలిపోతున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అభ్యంతరకరంగా ఉందని చెపుతూ... ఎవరూ ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇండస్ట్రీపై దాడులు జరగడం తప్పేనంటూ... వాళ్లు వ్యక్తిగతంగా మాట్లాడిన తీరుపట్ల కొందరు బాధపడి అలా ప్రవర్తించారని సమర్థించుకున్నారు. అయినా సరే, వారు చేసింది తప్పేనని ఆందోళనకారులను ఉద్దేశించి అన్నారు.
తెలంగాణా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ మాట్లాడుతూ... సినిమాల్లో తెలంగాణా మాండలికాన్ని విలన్లకు, కమెడియన్లకు పెట్టి కించపరస్తున్నారనీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర తదితర ప్రాంతాలవారి మాండలికాన్ని కూడా కించపరిచేవిగా ఉంటున్నాయని అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
అది సరే... మరి జూనియర్ ఎన్టీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.