1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Condoms

Neha Dhupia | Condoms | Raat Gayi Baat Gayi | Indian Institute of Technology | కళాశాల ఉత్సవాల్లో కండోమ్ ప్యాకెట్లు విసిరేశా: ధూపియా

నేహా ధూపియా
దాదాపు నగ్నంగా నటించినంత పనిచేసే తారల్లో నేహా ధూపియా అగ్రస్థానంలో నిలబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ తార ఇటీవల తను ఓ కళాశాల ఉత్సవానికి హాజరైనప్పుడు విద్యార్థుల మధ్యలోకి కండోమ్ ప్యాకెట్లు విసిరేసి సంచలనం సృష్టించింది. నేహా విసిరిన కండోమ్ ప్యాకెట్లను చూసి విద్యార్థులు అవాక్కయిపోయారు. 

వివరాలలోకి వెళితే.... ఇటీవల ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన మూడ్ ఇండిగో ఫెస్టివల్‌కు నేహా ధూపియా హాజరైంది. నేహాధూపియాతోపాటు "రాత్ గయి బాత్ గయి" చిత్రం నిర్మాత కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నారు.

కార్యక్రమం జరుగుతుండగా నిర్మాత ఓ పెద్ద సంచీలో కండోమ్‌లు, సిరంజిలు, డిస్పెన్సరీ సామగ్రిని తీసుక వచ్చి తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా వాటిని విద్యార్థుల మధ్యకు విసిరేయాల్సిందిగా నేహా ధూపియాను కోరాడు.

తొలుత నిర్మాత అభ్యర్థనను నేహా తోసిపుచ్చింది. కండోమ్‌లను విద్యార్థుల మధ్యలోకి ఎట్టి పరిస్థితుల్లో విసిరేయనని భీష్మించింది. కానీ చిత్రాన్ని ప్రమోట్ చేయాలంటే ఇటువంటి పనులు చేయాల్సిందేనని సదరు నిర్మాత గట్టిగా చెప్పడంతో... ఆలోచించిన నేహ ఆ ప్యాక్‌లను విద్యార్థుల మధ్యకు విసిరింది.

ఆ తర్వాత... కండోమ్‌లను అలా ఎందుకు విసిరావని విలేకరులు ప్రశ్నిస్తే... ఏ ఉత్పత్తినైనా మార్కెట్ చేసుకోవడానికి తయారీదారులు రకరకాల మార్గాలను అన్వేషిస్తారు. మా నిర్మాత ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు కనుక దానిని తను అమలు పరచానని కూల్‌గా చెప్పింది నేహా ధూపియా.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT