1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Reemasen

Yuganiki Okkadu | Reemasen | Audio | జనవరి 8న యుగానికి ఒక్కడు ఆడియో

యుగానికి ఒక్కడు
పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సుప్రసిద్ధ దర్శకుడు శ్రీ రాఘవ తాజాగా సూర్య సోదరుడైన కార్తి కథానాయకుడుగా 40 కోట్ల రూపాయల వ్యయంతో యుగానికి ఒక్కడు చిత్రాన్ని నిర్మించారు. తెలుగు- తమిళ భాషలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆడియోను సోనీ కంపెనీ రైట్స్ తీసుకుని జనవరి 8న విడుదల చేయనుంది.

డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ పతాకంపైన నిర్మించిన యుగానికి ఒక్కడు చిత్రం గురించి చిత్ర సమర్పకులు ఆర్. రవీంద్రన్ చెపుతూ.. శ్రీ రాఘవ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వాన, కార్తి కథానాయకుడుగా మేము నిర్మించిన ద్విభాషా చిత్రం యుగానికి ఒక్కడుకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలుగు వెర్షన్‌కి సంబంధించి జనవరి 8న ఆడియోను రిలీజ్ చేస్తున్నాము.

ప్రస్తుతం రీ- రికార్డింగ్ పూర్తి అయి మిక్సింగ్ కార్యక్రమాల్లో ఉంది. శ్రీ రాఘవ చెప్పిన కథకు మేము ఏ విషయంలోను వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. దర్శకుడు శ్రీ రాఘవ ఎంతో శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు.

సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్‌గా యీ చిత్రాన్ని ఆయన రూపొందించారు. తప్పకుండా ఈ చిత్రం క్లాసు, మాసు అని కాకుండా అన్ని తరగతుల వారి ఆదరణను పొందుంతుందని మా నమ్మకం. ఫస్ట్ కాపీ రాగానే సెన్సార్ కార్యక్రమాలు గావించి విడుదల చేస్తామన్నారు. కార్తీ సరసన రీమాసేన్- ఆండ్రియా జెరోమియా నాయకలు కాగా పార్తీబన్, ప్రతాప్ పోతన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- శ్రీ రాఘవ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT