Ramcharan Teja | Magadheera | Bollywood | Deepika Padukone | మగధీర చూసి ప్లాట్ అయ్యా: బాలీవుడ్ నిర్మాత
WD
ఇప్పటికే రామ్‌చరణ్ అంగీకారాన్ని కూడా తీసుకున్నామని చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి డిసెంబరు నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
కథలో రామ్‌చరణ్ ఓ నిరుపేద అబ్బాయిగా నటిస్తాడని, ఈ అబ్బాయిని ఓ కోటీశ్వరురాలైన అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమ్మాయి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం ఉన్నదని చెప్పారు.
కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన దీపికా పదుకునే లేదంటే కంగనా రనౌత్‌లో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రం తను ఎన్నాళ్లుగానో సిద్ధం చేసి పెట్టుకున్న అద్భుతమైన కథను ఆధారం చేసుకుని రూపొందించబడుతుందని పేర్కొన్నారు.