Actress Priyamani | Anti- Actress | Shambho... Shiva shambho | విలన్ పాత్ర నా డ్రీమ్ రోల్ : ప్రియమణి
జాతీయ అవార్డులను అలవోకగా ఎగరేసుకపోయే మలయాళీ భామ ప్రియమణికి లేడీ విలన్‌గా నటించాలని ఎంతో కుతూహలంగా ఉన్నదట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. రజనీకాంత్ చిత్రం "నరసింహ"లో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ఛాలెంజింగ్ పాత్ర చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం శంభో... శివశంభో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తను లంగా- ఓణీలో నటించానని చెపుతోంది. ఇంట్లో కూడా అదే డ్రెస్సులో ఉంటారా...? అని ప్రశ్నిస్తే, నవ్వుతూ... ఇంట్లో షార్ట్స్ వేసుకుంటాననీ, బయటకెళితే జీన్స్, టీ షర్ట్ వేసుకుంటాననీ చెప్పింది. ఇక పెళ్లిళ్లు- పేరంటాళ్లకైతే సందర్భానికి తగిన దుస్తులు వేసుకుంటానని చెప్పుకొచ్చింది.
ఇక తన అభిమానులు చాలామంది తన నవ్వు చాలా బావుంటుందని అంటారని సంబరపడిపోతూ చెప్పింది. నవ్వుతూ మాట్లాడటం తనకు చిన్నప్పట్నుంచీ అలవాటని అంటోంది ప్రియ. అన్నట్లు.. ఈ కేరళ కుట్టి తెలుగు భాషను కూడా అనర్గళంగా మాట్లాడేస్తుందండోయ్.
