1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Bellamkonda

Actress Roja| Bellamkonda | Shambho Shiva Shambho | Sankranthi festival | బెల్లంకొండ "శంభో శివశంభో"కు రోజా తలబొప్పా...?

రోజా
FILE
నటి రోజా చాన్నాళ్ల తర్వాత శంభో శివశంభో చిత్రంతో వెండితెరపై మరోసారి కనిపించబోతోంది. ప్రేక్షకులకు ఇది మంచి వార్తే అయినప్పటికీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు మాత్రం చేదు వార్త అవుతుందేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

రోజా ఎంట్రీ బెల్లంకొండకు చేదు వార్త ఎలా అవుతుందీ అని అనుకుంటున్నారా...? మరేం లేదు... రోజా ఆ మధ్య మైకులు పట్టుకుని సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిది కదా. ఈ నేపథ్యంలో తెలంగాణా అనుకూల వాదులు రోజా నటించిన ఈ చిత్రానికి అడ్డంకులు ఏమైనా సృష్టిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే తెలంగాణావాదులు ఇక నుంచి తాము తమ ఆందోళనలను శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పారు కనుక ఆ భయమేమీ లేదని తెలంగాణాకు చెందిన కొందరు నాయకులు చెపుతున్నారు. కానీ చిరంజీవి బంధువుల సినిమాలను మాత్రం అడ్డుకుంటామని అంటున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT